విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ వ్యూహాం ఇదే.. !

ముందస్తు వ్యూహాలతో వెళ్తేనే యుద్దం గెలవగలం. ఇప్పుడు టీమిండియాతో టెస్ట్ యుద్ధానికి ఇంగ్లండ్ వ్యూహాలని రచిస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ప్రత్యేక వ్యూహాలని పన్నుతోంది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం అంత తేలిక కాదని చెప్పిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ కోచ్‌ గ్రహమ్‌ థోర్‌.. అతడిని అవుట్ చేసేందుకు కోసం వ్యూహాలు రెడీ చేస్తున్నామని తెలిపారు.

“కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని అందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా అతడు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. సొంతగడ్డపై ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. అయితే అతడిని ఎదుర్కోవాలంటే మా బౌలింగ్ దళం అత్యుత్తమ బంతుల్నే విసరాలి. స్పిన్నర్లు, పేసర్లు అదే చేయాలి. టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చేలా బౌలింగ్‌ చేయాలి. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే.. స్పిన్‌తో పాటు పేస్‌ దళం పటిష్టంగా ఉంది. ఉప ఖండానికి వచ్చినప్పుడు స్పిన్‌ను ఎంతో జాగ్రత్తగా ఎదుర్కోవాలి” అని గ్రహమ్‌ తెలిపాడు.