అభిమానులకు బర్త్ డే షాకిచ్చిన శింబు

బర్త్ డే కానుకగా అభిమానులకి బహుమతులు ఇస్తుంటారు హీరోలు. అయితే కోలీవుడ్ హీరో శింబు మాత్రం అభిమానులకి షాకిచ్చాడు. ఫిబ్రవరి 3న శింబు పుట్టినరోజు. ఆ రోజున అభిమానులెవ్వరు తన ఇంటికి రావొద్దని శింబు ట్విట్ చేశారు. దానికి ఓ కారణం ఉంది. ఓ ప్రాంతానికి వెళ్లాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నా. ఈ సారి పుట్టినరోజున అక్కడకి వెళ్తున్నా. అందువలన ఇంట్లో ఉండటం లేదు. అభిమానులెవ్వరు తన  ఇంటికి రావొద్దని కోరారు.

‘జీవితంలో నేను ఎన్నో ఇబ్బందులు, ఎత్తుపల్లాలను చూశాను. కానీ మీ ప్రేమాభిమానాలు మాత్రం ప్రతి క్షణం నాతోనే ఉన్నాయి. శారీరకంగా నేను ఫిట్‌గా మారడానికి, వరుస సినిమాలు ఓకే చేయడానికి మీ అభిమానమే కారణం. నేను నటించిన ‘ఈశ్వరన్‌’ సినిమాపై మీరు చూపించిన ప్రేమకు ఎంతలా కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. నేను మిమ్మల్ని అభిమానుల్లా కాదు నా కుటుంబంలా భావిస్తున్నాను. ఫిబ్రవరి 3న నా పుట్టినరోజును మీతో జరుపుకోవాలని అనుకున్నాను. కానీ ఎప్పటి నుంచో ఓ చోటుకి వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాను. అలా ఈ పుట్టినరోజుకు అక్కడికి వెళ్తున్నాను. ఆరోజు నేను నగరంలో ఉండడం లేదు. కాబట్టి ఎవరూ మా ఇంటికి రావొద్దు’ అని శింబు ట్వీట్‌ చేశారు.