శృతిహాసన్ కొత్త బోయ్ ఫ్రెండ్.. ఇతడేనా ?
హీరోయిన్ శృతిహాసన్ కొత్త ప్రియుడిని పరిచయం చేసిందా ? అంటే అవుననే అంటున్నారు. శ్రుతిహాసన్ తాజాగా 35వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె గురువారం తన నివాసంలో బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి.
ఇందులో ఓ వ్యక్తి శృతిని స్పెషల్ గా విష్ చేశాడు. శ్రుతిహాసన్‌తో సన్నిహితంగా దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన అతడు.. ‘ప్రియమైన (లవ్ సింబల్) శ్రుతిహాసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేశారు.ట్విటర్‌లో సైతం ఆమె ఫొటోని షేర్ చేస్తూ.. ‘నా రాణికి జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆమెతో దిగిన ఓ ఫొటోని ట్విటర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.
అతడి పోస్ట్ పై స్పందించిన శృతి.. ‘నా ఈరోజును ఎంతో ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు’ అని రిప్లై ఇచ్చారు. ఇంతకీ అతడెవరో తెలుసా ? ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక. ఇతడే శృతి కొత్త బాయ్ ఫ్రెండ్ అనే ప్రచారం మొదలైంది. మరీ.. దీనిపై శృతి ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
అంతకుముందు #MichaelCorsaleతో శృతిహాసన్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలింది. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత శృతి సినిమాల్లేక ఖాళీగానే ఉంది. ఇక ఇటీవలే క్రాక్ తో రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. ఫుల్ ఫామ్ ని అందుకుంది. ఏకంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్ సలార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.