భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. అంపైర్లు వీరే !

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మరో వారం రోజుల్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ  టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ముగ్గురు భారత ఐసీసీ ప్యానెల్‌ అంపైర్లను ఖరారు చేసింది. వీరేందర్‌ శర్మ, అనిల్‌ చౌదరితో పాటు నితిన్‌ మీనన్‌ ఉన్నారు. నితిన్‌ ఇప్పటికే సుదీర్ఘ ఫార్మాట్‌లో అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించగా.. అనిల్‌, వీరేందర్‌ తొలిసారి చెన్నై టెస్టులో బరిలోకి దిగనున్నారు. కాగా, ఈ ముగ్గురూ ఐపీఎల్‌ ఈవెంట్‌లో మ్యాచ్‌ పర్యవేక్షకులుగా కొనసాగుతున్నారు.

మరోవైపు ఇంగ్లాండ్‌, భారత్‌ ఆటగాళ్లు ప్రస్తుతం చెన్నైలోని ఓ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్నారు. క్వారంటైన్ లో ఉంటూనే టీమిండియా ఆటగాళ్లపై విడివిడిగా వ్యూహాలు పన్నుతున్నారు. కెప్టెన్ కోహ్లీపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నట్టు సమాచారమ్. ఇక, ఫిబ్రవరి 5 నుంచి చెపాక్‌లో తొలి రెండు టెస్టులు ఆడనుండగా.. తర్వాత అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో మరో రెండు ఆడనున్నారు. ఆపై ఐదు టీ20ల సిరీస్‌, మూడు వన్డేల సిరీస్‌లు జరగనున్నాయి.