సమ్మర్ బరిలో వకీల్ సాబ్

టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ జాతర జరుగుతోంది. సినిమాలన్నీ వరుసపెట్టి రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకుంటున్నాయి. సమ్మర్, దసరా, దీపావళీ, క్రిస్మస్, న్యూ ఇయర్, వచ్చే యేడాది సంక్రాంతి వరకు కర్చీప్ లు వేసేస్తున్నారు. ఈ లిస్టులో స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా వకీల్ సాబ్ కూడా రిలీజ్ డేటు ఫిక్స్ చేసేశాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ తెరకెక్కింది.ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించారు. బాలీవుడ్ హిట్ పింక్ సినిమాకి రిమేక్ ఇది. ఇందులో అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన వకీల్ సాబ్ టీజర్ కు మంచి స్పందన దక్కుతోంది. వకీల్ సాబ్ టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని పవర్ స్టార్ అభిమానులు చెప్పుకుంటున్నారు.