ఇకపై థియేటర్స్’లో వందశాతం ఆక్యుపెన్సీ
సినీ పరిశ్రమకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. థియేటర్స్ లో వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చింది. కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ 6 నెలల పాటు మూత పడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ పరిస్థితుల రీత్యా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునఃప్రారంభించుకోవడానికి గతేడాది అక్టోబర్‌లో కేంద్రం ఓకే చెప్పింది. కరోనా తగ్గుముఖం పట్టడం, కరోనా వాక్సిన్ కూడా రావడంతో.. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెనింగ్ కి కేంద్రం ఓకే చెప్పేసింది. ఈ మేరకు కొత్త గైడ్ లైన్స్ ని విడుదల చేసింది.
1. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు.
2. టికెట్లు కొనుగోలు చేసే ప్రాంతంలో, థియేటర్ వెలుపల వెయిటింగ్ రూమ్స్ వద్ద ప్రేక్షకులు తప్పనిసరిగా ఆరు అడుగుల దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలి.
3. థియేటర్ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
4. ప్రవేశం వద్ద శరీరా ఉష్ణోగ్రతను కొలిచే ‘థర్మల్ స్ర్కీనింగ్’ ఏర్పాట్లు ఉండాలి.
5. హ్యాండ్ వాష్, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
6. హాలులో ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్ ఉండాలి.