బిగ్ బాస్ 5 : తొలి కంటెస్టెంట్ ఇతడే !

బిగ్ బాస్ అభిమానులకు గుడ్ న్యూస్. అతి త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలు కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్స్ కోసం వేట షురు చేసింది. అంతేకాదు.. తొలి కంటెస్టెంట్ ని కూడా ఎంపిక చేసింది. తొలి కంటెస్టెంట్ గా సాఫ్ట్‌వేర్ డెవలపర్ యూట్యూబ్ సిరీస్‌తో ఫుల్ ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇతనికి సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు సెలక్ట్ చేశారని అంటున్నారు.షణ్ముఖ్ జస్వంత్‌కు యూట్యూబ్‌లో 26 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 10 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇటీవలే ముగిసింది. ఈ సీజన్ విజేతగా అభిజిత్ నిలిచారు. రన్నర్ గా అఖిల్ నిలిచారు. అయితే వీరిద్దరి కంటే ఎక్కువగా సోహైల్ హైలైట్ అయ్యారు. ఏకంగా మెగాస్టార్ కళ్లలో పడ్డాడు. మెగాస్టార్ నుంచి వరాలు పొందాడు. మెగా అభిమానులకి దగ్గరయ్యాడు. బిగ్ బాస్ నుంచి బయటిరాగానే హీరోగా తొలి సినిమాని పట్టాలెక్కించాడు. ఈ సినిమాకు చిరు సపోర్ట్ చేయడంతో పాటు.. గెస్ట్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉంది.

మూడో, నాల్గో సీజన్ కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఐదో సీజన్ కు హోస్ట్ గా ఎవరు వ్యహరించనున్నారు ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రతీ సీజన్ ప్రారంభానికి ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వస్తోంది. సీజన్ 5 కోసం కూడా తారక్ పేరు వినబడుతోంది. ఆయన కాదంటే మాత్రం మళ్లీ నాగ్ తోనే కానిచ్చేయొచ్చు. విజయ్ దేవరకొండని కూడా బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించినట్టు సమాచారమ్. అయితే సినిమాలతో బిజీగా ఉండే విజయ్.. బిగ్ బాస్ షోని చేయడం కష్టమే అంటున్నారు. కొన్నిరోజులు ఆగితే బిగ్ బాస్ 5 హోస్ట్ ఎవరు ? కంటెస్టేంట్ వివరాలు తెలియరానున్నాయి.