బడ్జెట్ యాప్ వచ్చేసింది

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్ సభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. దేశ చ‌రిత్ర‌లో తొలిసారి కేంద్ర బ‌డ్జెట్ పేప‌ర్‌లెస్‌గా మారింది.ఈ సారి బ‌డ్జెట్‌ను ఐప్యాడ్‌లో పొందుప‌రిచారు. సాంప్ర‌దాయ‌క‌మైన‌ బ‌హీఖాతా పుస్త‌కం బ‌దులుగా .. లోక్‌స‌భ‌లో ఐప్యాడ్ ద్వారా మంత్రి 2021-22 బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపించ‌నున్నారు. ఎర్ర‌టి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ పార్లమెంట్ కు చేరుకున్నారు.

పేప‌ర్‌లెస్ బ‌డ్జెట్‌గా గుర్తింపు పొందిన తాజా బ‌డ్జెట్‌కు సంబంధించిన సాఫ్ట్ కాపీని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు. యూనియ‌న్ బ‌డ్జెట్ మొబైల్ యాప్‌ను మంత్రి సీతారామ‌న్ ఆవిష్క‌రించారు. చాలా సులువైన రీతిలో డిజిట‌ల్ విధానాన్ని రూపొందించారు.  ఆ యాప్‌లో మొత్తం 14 యూనియ‌న్ బ‌డ్జెట్ డాక్యుమెంట్లు ఉంటాయి.  వార్షిక ఆర్థిక నివేదిక‌,  గ్రాంట్స్ డిమాండ్‌, ఫైనాన్స్ బిల్లు వివ‌రాలు కూడా ఆ యాప్‌లో పొందుప‌రిచారు.

2019లోనూ మోదీ సర్కార్ బ‌డ్జెట్ వేళ కొత్త సాంప్ర‌దాయాన్ని ఆరంభించారు.  లెద‌ర్ బ్రీఫ్ కేసులో తీసుకువెళ్లే బ‌డ్జెట్ ప‌త్రాల‌ను.. ఆ ఏడాది ఆమె తొలిసారి బ‌హీఖాతా పుస్త‌కం రూపంలో తీసుకువెళ్లారు. ఇప్పుడు కరోనా విజృంభణ తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ ని పేపర్ లెస్ గా మార్చారు. రెడ్ క‌ల‌ర్ బ్యాగులో ట్యాబెల‌ట్‌ను పార్ల‌మెంట్‌కు తీసుకువెళ్లారు మంత్రి సీతారామ‌న్‌.  ఆ బ్యాగుపై గోల్డ్ క‌ల‌ర్‌తో జాతీయ చిహ్నం ఉన్న‌ది.  ఎరుపు, క్రీమ్ క‌ల‌ర్ చీర‌లో సీతారామ‌న్‌.. పార్ల‌మెంట్‌కు వెళ్ల‌డానికి ముందు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వెళ్లారు.