బ్రేకింగ్ : బడ్జెట్’ని ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్

కేంద్ర బడ్జెట్ 2021-22ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సారి పేపర్ లెస్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. డిజిటల్ బడ్జెట్ ని తీసుకున్నారు. మేడిన్ ఇండియా ట్యాబ్ లో చూసి నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాన్ని మొదలెట్టారు.

అంతకుముందు బడ్జెట్ ని కేంద్ర కేబినేట్ ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినేట్ ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. దేశాన్ని అన్ని రంగాల్లో సొంతకాళ్లపై నిలబడేలా ఈ బడ్జెట్ ని నిర్మించినట్టు సమాచారమ్.