కేంద్ర బడ్జెట్-2021 ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా ?


కేంద్ర బడ్జెట్ 2021-22ని మరికాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలోప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే నిర్మలమ్మ పార్లమెంట్ కు చేరుకున్నారు. అయితే ఈ సారి బడ్జెట్ ని ప్రవేశపెట్టే విషయంలో కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. పేపర్ లెస్ బడ్జెట్ గా ట్యాబ్ ద్వారా బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ యాప్ ని కూడా ప్రారంభించారు. ఇందులో బడ్జెట్ తో పాటుగా.. ఆర్థిక సంఘం నివేదికని చూసుకోవచ్చు.

ఇక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి ముందుకు  కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాతో మాట్లాడారు.  ‘సబ్‌కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’ నినాదాలు మోదీ ప్రభుత్వ అజెండా అన్నారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ప్రకటన భారతదేశానికి కొత్త దిశను ఇచ్చిందని, మహమ్మారి నుంచి రక్షణ కల్పిస్తుందని, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తీసుకువస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలను బడ్జెట్‌ నెరవేరుస్తుందనే పూర్తి విశ్వాసం తనకుందన్నారు.