కేంద్ర బడ్జెట్.. ఆరోగ్యానికి పెద్దపీఠ !
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కరోనా విజృంభణ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. కరోనా నేర్పిన గుణపాఠం నేపథ్యంలో తాజా బడ్జెట్ లో ఆరోగ్యానికి కేంద్రం పెద్దపీఠ వేసింది. ఆత్మనిర్బర్ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు.
‘ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన’ అన్న పేరుతో కొత్త పథకాన్ని ఆమె సభలో ప్రకటించారు. ఈ పథకం కింద 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా ఆరోగ్యంపై బడ్జెట్‌ను పెంచినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మిషన్ సూచించిన కార్యక్రమాలను కూడా అమలు చేస్తామని ప్రకటించారు.9 బీఎస్‌ఎల్-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్ మిషన్ అర్బన్ ప్రారంభించనున్నట్ట చెప్పారు. ఈ పథకం ద్వారా 87వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు, స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ.లక్షా 41వేల 678 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.