విరుష్కల కూతురిని చూశారా ?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ భార్య అనుష్క శర్మ పండింటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. కూతురు పుట్టిన ఆనందాన్ని విరుష్క దంపతులు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అదే సమయంలో.. తమకి ప్రైవసీ ఇవ్వాలని అభిమానులని కోరారు. దీంతో అభిమానులు వారిని డిస్ట్రబ్ చేయలేదు. కూతురుని చూపించమని కోరలేదు.

తాజాగా విరుష్కలు తమ ముద్దుల కూతురుని పరిచయం చేశారు. పాప ఎత్తుకుని దిగిన ఫోటోని అనుష్క శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసీస్ టూర్ నుంచి కోహ్లీ పితృత్వ సెలవులపై భారత్ కి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రెండు టెస్టు మ్యాచ్ లని మాత్రమే ఆడిన కోహ్లీ భారత్ కి తిరిగొచ్చారు.