రైతుల ఆందోళన.. రాజ్యసభలో 15 గంటల పాటు చర్చ !

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో రైతుల ఆందోళనలపై సుదీర్ఘంగా చర్చించాలని డిమాండ్ చేశారు. అందుకు ప్రతిపక్షాలు కూడా ఓకే చెప్పాయి.

రైతుల అంశంపై కనీసం 5 గంటల పాటు సభలో ఏకధాటిగా చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ.. ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. దీనిపై 15 గంటల పాటు చర్చిద్దామని ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్‌ పక్షనేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం ఈ సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది.