రాజ్యసభలో మొబైల్ ఫోన్స్ బ్యాన్

పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం సభలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులకి కీలక సూచనలు చేశారు. ఇకపై సభలో మొబైల్ ఫోన్స్ ని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. సభ్యులెవరు సభలోకి ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. సభ జరుగుతున్న సమయంలో కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడడమే కాకుండా.. సభా కార్యకలాపాలను కూడీ వీడియో తీస్తున్నారంటూ వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం కరెక్టు కాదు. ఉన్నత రాజ్యసభ ఛాంబర్లో కూర్చొని సభ్యులు ఇలా వీడియోలు తీయడం పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధమన్నారు.

ఇక నుంచి ఎవరూ కూడా ఛాంబర్లలో, సభా ప్రాంగణంలో మొబైల్స్ అస్సలు వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాజ్యసభలో రైతుల నిరసనలపై చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 5 గంటల పాటు చర్చ జరపాలని కోరారు. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. 5 గంటలు కాదు.. ఏకంగా 15 గంటలపాటు రైతుల ఆందోళనలపై చర్చిద్దామని తెలిపింది. రేపు ఈ సుదీర్ఘ చర్చ జరగనుంది.