..బ్యాచిలర్ రిలీజ్ డేట్ పోస్టర్.. రొమాంటిక్ !


అక్కినేని యంగ్ హీరో అఖిల్ నాల్గో సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ.. ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్రబృందం రిలీజ్ డేటు పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో అఖిల్-పూజా రొమాంటిక్ మూడులో ఉన్నారు. అంతేకాదు.. తొలిసారి పూజాపై అఖిల్ పైచేయి సాధించారు.

ఎందుకంటే ? ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు పోస్టర్స్ బయటికొచ్చాయ్. ప్రతి పోస్టర్ లోనూ పూజా హెగ్డే అఖిల్ ని డ్యామినేట్ చేసినట్టు కనిపించేది. తొలి పోస్టర్ లో అయితే కాలిగోరుతో అఖిల్ ని గోకుతూ కనిపించింది. అది అక్కినేని అభిమానులకి నచ్చలేదు. ఆ తర్వాత వదిలిన పోస్టర్స్ లోనూ ఇదే తంతు. అయితే తాజాగా వదిలిన రిలీజ్ డేటు పోస్టర్ లో మాత్రం అఖిల్-పూజా బ్యాలెన్స్ గా కనిపిస్తున్నారు. కళ్లలో కళ్లుపెట్టి ప్రేమగా చూసుకుంటున్నారు.