సప్రైజ్ : ‘ఉప్పెన’ కోసం తారక్ వాయిస్ ఓవర్

మెగా యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఉప్పెన’‌. దర్శకుడు  సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఉప్పెన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని రేపు (ఫిబ్రవరి4) రిలీజ్ చేయనున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ కానుంది. అంతేకాదు.. ఉప్పెన ట్రైలర్ తారక్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం కానుందట.

ఈ విషయాన్ని ఇప్పటి వరకు చిత్రబృందం రివీల్ చేయలేదు. ప్రేక్షకులని సప్రైజ్ చేసేందుకు తారక్ వాయిస్ ఓవర్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. ఇక ఈ చిత్రంలో మంగ‌ళూరు బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్-సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మొత్తం సుకుమార్ పర్యవేక్షణలో తెరకెక్కింది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత కూడా సుకుమార్ సూచన మేరకు రీ షూట్స్ చేశారు. స్క్రీన్ ప్లే లోనూ సుకుమార్ మార్పులు చేశారని.. దాంతో.. సినిమా మరింత షార్ప్ గా అయిందని టాక్.