షాకింగ్.. ‘సలార్’ సీన్స్ లీకు

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సలార్’. ఇటీవలే సింగరేణిలో తొలి షెడ్యూల్ ప్రారంభం అయింది. ప్రస్తుతం బైక్ మెకానిక్ షెడ్ కు సంబందించిన సీన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ సీన్స్ లో ప్రభాస్ తో పాటు శృతి హాసన్ పాల్గొంది. వీరిద్దరిపై చిత్రీకరిస్తున్న సీన్స్ కూడా లీక్ అవుతున్నాయి. అంతకుముందు ప్రభాస్ షూటింగ్ కోసం సింగరేణిలో అడుగుపెడుతున్న ఫోటోలు, వీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగ్ సీన్స్ కూడా లీక్ అవుతుండటంతో చిత్రబృందం మరింత జాగ్రత్తపడుతున్నట్టు తెల్సుతోంది.

హై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సలార్ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం శృతిహాసన్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు సమాచారమ్. ఏకంగా రూ. 2కోట్లు తీసుకుంటుందట. ప్రభాస్ సలార్ తో పాటు ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయాల్సి ఉంది. సలార్ తో పాటు ఆదిపురుష్ ని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.