చైతూ కోసం నాని తగ్గాడు

టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ జాతర జరిగిన సంగతి తెలిసిందే. చిన్నా-పెద్దా సినిమాలన్నీ వరుసపెట్టి రిలీజ్ డేట్స్ ఖరారు చేసుకున్నాయి. దీనికి కారణం.. కరోనా టైమ్ లో సినిమాల రిలీజ్ లు వాయిదా పడటమే. రిలీజ్ డేట్స్ ని ప్రకటించే క్రమంలో కొన్ని సినిమాలకి క్లాష్ వచ్చాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’.

ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 2 రిలీజ్ చేద్దామనుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఏప్రిల్ 16కు జరిపాయి. అయితే అదే డేటుకి ‘నాని టక్ జగదీష్’ వస్తోంది. ఇలా రెండు పెద్ద సినిమాలు ఒకే డేట్ లో రావడం బాగుండదని సినిమా పెద్దలు అలోచించారు. ఈ విషయంలో క్లాషెస్ ఎందుకు అని ఫైనల్ గా హీరో నాని చెప్పిన డేట్ కే ఇద్దరు అంగీకరించారు. ఏప్రిల్ 16న ‘లవ్ స్టోరీ’ విడుదల అయితే.. ఆ నెలలోనే 23న టక్ జగదీష్ విడుదల చేస్తారట. ఈ మేరకు ఒప్పందం కుదిరింది.