లేడీ విజయ్ దేవరకొండని చూశారా ?

స్టయిలీష్ స్టార్ గా అల్లు అర్జున్ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ బన్నీని మించిపోయాడు. స్టయిలీష్ ఐకాన్ అనిపించుకుంటున్నారు. తనకంటూ ప్రత్యేకమైన స్టయిల్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ రౌడీ స్టయిల్ కి స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయిన సంగతి తెలిసిందే. విజయ్ స్టయిల్ అంటే తనకిష్టమని సినిమా వేదికలపైనే బన్నీ చెప్పారు. ప్రస్తుతం విజయ్ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అనన్య పాండే హీరోయిన్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం విజయ్ రింగుల జుట్టుతో కొత్త స్టయిల్ లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కనపెడితే.. తాజాగా లేడీ సూపర్ స్టార్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కళ్లజోడు.. స్టైలిష్ హెయిర్.. రింగుల వెంట్రుకలు.. టీ షర్ట్ అవన్నీ చూస్తుంటే విజయ్ దేవరకొండ డూప్ మాదిరే అనిపిస్తుంది.

ఇంతకీ ఈ లేడీ విజయ్ దేవరకొండ ఎవరబ్బా ఈమె అనుకుంటున్నారా..? ఇంకెవరు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అనుపమ కురులు రింగు రింగులుగా.. అందంగా ఉంటాయ్. వాటిని కాస్త విజయ్ దేవరకొండ ఎయిర్ స్టయిల్ గా మార్చేసింది. వాటిన తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడీ.. ఈ పిక్స్ సోషల్ లో మీడియాలో వైరల్ అవుతున్నాయ్. లేడీ విజయ్ దేవరకొండ అంటూ నెటిజన్స్ కామెంట్స్ కొడుతున్నారు. మరీ.. లేడీ విజయ్ దేవరకొండగా అనుమప కూడా బోల్డ్ గా మారిపోతుందేమో చూడాలి.