కుక్క ముందు పిల్లిలా మారిన చిరుత
కుక్కును వేటాడానికి ప్రయత్నించిన చిరుత.. చివరికి ఆ కుక్కు ముందు పిల్లా మారింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కైకంబ గ్రామ సమీపంలో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో చిరుతకు శునకం కంటపడింది. దీంతో ఆ కుక్కను చిరుత వెంబడించింది. చిరుత అరుపులకు భయపడ్డ శునకం గ్రామం వైపు పరుగెత్తింది. రేగప్ప అనే రైతు ఇంటి ఆవరణలో ఉన్న మరుగుదొడ్డిలోకి కుక్క ప్రవేశించింది. చిరుత కూడా దాంట్లోకి వెళ్లింది.
రైతు కుటుంబ సభ్యులు అప్రమత్తమైన మరుగుదొడ్డి తలుపు మూసి గడియ పెట్టారు. టాయిలెట్ పైకప్పు నుంచి ఫోటోలు తీసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే మరుగుదొడ్డిలో చిరుత, కుక్కపై దాడి చేయలేదు. కుక్కను చూసి భయపడిందేమో.. కానీ ఆ చిరుత ఓ మూలకు పిల్లిలా నక్కింది. ఇలా ఆ రెండు జంతువులు ఏడు గంటల పాటు మరుగుదొడ్డిలోనే ఉండిపోయాయి. ఏడు గంటల తర్వాత చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ చిరుత తప్పించుకుని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం కుక్కు.. చిరుత బాత్ రూమ్ లో ఉన్నఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.