భారతరత్న.. రతన్ టాటా విజ్ఝప్తి !

భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ‘భారతరత్న’ ఇవ్వాలనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. ‘భారతరత్న ఫర్ రతన్ టాటా’ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రతన్ టాటా స్పందించారు.

” ‘భారతరత్న’ అవార్డు కంటే తాను దేశానికి సేవ చేసే అవకాశం రావడాన్నే అదృష్టంగా భావిస్తా. తనకి ‘భారతరత్న’ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న వారిని అభినందిస్తున్నా. కానీ, ఈ ప్రచారం ఆపేయాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నింటికంటే ముందు నేను భారతీయుడిని. దేశ అభివృద్ధిలో నేను భాగం కావడాన్ని నాకు దక్కిన మహాభాగ్యంగా భావిస్తాను” అన్నారు.