ప్రేమలో పడిన ప్రభాస్
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఎలానో.. టాలీవుడ్ లో ప్రభాస్ అలాగే. వీరిద్దరి పెళ్లి టాపిక్ ఎప్పుడూ హాట్ టాపిక్ నే. కానీ పెళ్లి చేసుకోరు. ఆంజనేయుడు పెళ్లెప్పుడు అంటే.. ? రేపే అన్నట్టు.. వీరి పెళ్లి న్యూస్ ఎప్పుటికప్పుడు హాట్ టాపిక్ గా మాత్రం ఉంటుంది. రియల్ లైఫ్ లో ప్రేమ, పెళ్లి విషయాలపై ఫోకస్ పెట్టిని ప్రభాస్.. రీల్ లైఫ్ లో మాత్రం ప్రేమలో పడ్డారు. తాజాగా ప్రేమని ఫీలవుతున్న ప్రీ టీజర్ ని వదిలారు.
రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా ‘రాధేశ్యామ్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూరప్ నేపథ్యంలో పునర్జన్మల ప్రేమకథగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ గాఢ ప్రేమికుడిగా కనిపించబోతున్నారు.ఒక జన్మ సరిపోని ప్రేమజంటగా ప్రభాస్-పూజా కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్ ని ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14)న రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ప్రీ టీజర్ ని వదిలింది చిత్రబృందం. ఇందులో ప్రభాస్ ప్రేమలో పడిన ఫీలింగ్ చూపించారు. ప్రభాస్ లుక్.. ఆయన లవ్ ఫీల్ అదిరిపోయాయ్. ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రీ టీజర్ ట్విట్టర్ ట్రెండింగ్ టాప్ లో ఉంది.