శృతిహాసన్ కొత్త ప్రియుడు.. క్లారిటీ వచ్చేసింది !
హీరోయిన్ శృతిహాసన్ ప్రేమలో విఫలమైంది. ఇటీవలే లండన్ ప్రియుడు మేఖేల్ తో బ్రేకప్ చేసుకుంది. బ్రేకప్ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. క్రాక్ తో హిట్ కొట్టింది. ప్రస్తుతం ‘సలార్’లో ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. అయితే ఇటీవల జరిగిన తన బర్త్ డే వేడుకల్లో శృతి హజారికా అనే వ్యక్తితో క్లోజ్‌గా ఫొటోలు దిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. హజారికా శృతి కొత్తప్రియుడు అనే ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారంపై శృతి ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో.. ఆ ప్రచారం నిజమేనని అనుకుంటున్నారు. అయితే తాజాగా శృతితో జరుగుతున్న ప్రచారంపై హజారికా స్పందించారు. ‘మ్యాజిక్, ఆర్ట్లలో మా ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి. శృతి కవితలను నేను వీడియోలుగా చేశాను. మా కలయిక అనధికారం మాత్రమే. రానున్న రోజులలో మరిన్ని క్రియేటివ్ ప్రాజెక్టుల కోసం పని చేయబోతున్నాం. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకోదలచుకోలేదు. ఆర్ట్, కల్చర్‌పై శృతికి మంచి పాషన్ ఉండగా.. అదే మా ఇద్దరిని కలిపింది’ అని తెలిపారు.