ఆహా.. యేడాది పూర్తి !
ఒకప్పటిలా థియేటర్స్ కి వెళ్తేనే.. వినోదం దొరికే కాలం పోయింది. హాయిగా ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలు చూడొచ్చు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు, స్పెషల్ షోస్ తో కాలక్షేమం చేయొచ్చు. ఇదంతా ఓటీటీ మహిమా. కరోనా లాక్ డౌన్ కి ముందే ఓటీటీలు పుట్టుకొచ్చాయ్. అయితే కరోనా లాక్ డౌన్ తో వాటికి డిమాండ్ పెరిగింది.
ఎంతలా అంతే.. ? స్టార్ దర్శక-నిర్మాతలు, స్టార్ హీరో-హీరోయిన్లు, నటీనటులు ఇటు వైపు చూసేలా. ఓటీటీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చేలా. తెలుగులో వచ్చిన తొలి ఓటీటీ ఆహా. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తీసుకొచ్చారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో.. ఆ తర్వాత కూడా ఆహా.. ప్రేక్షకులకి ఆహ్లాదకరమైన వినోదం పంచుతోంది.
ఆహా కోసం స్టార్ దర్శకులని రంగంలోకి దింపుతున్నారు. స్పెషల్ షో చేస్తున్నారు. ఇప్పుడు ఆహా.. యేడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ స్పెషల్ ట్విట్ చేశారు. #ahaTurns1 అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మొదట్లో డబ్బింగ్ సినిమాలని రిలీజ్ చేసిన ఆహా.. ఇప్పుడిప్పుడు స్టార్ హీరోల సినిమాలని కూడా రిలీజ్ చేస్తోంది. ఇటీవల క్రాక్ ఆహాలో రిలీజై మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది.
Yayyyyy! 😄🥳#ahaTurns1
Its been a year since we launched this homegrown Telugu OTT App & the love it has recieved has already put it in the biggg league! Big shows and great content are brewing 🙂 @ahavideoIN pic.twitter.com/bBpyr0LtxO
— Vijay Deverakonda (@TheDeverakonda) February 8, 2021