భారత టెన్నిస్‌ దిగ్గజం అక్తర్ అలీ ఇకలేరు


భారత టెన్నిస్‌ దిగ్గజం అక్తర్ అలీ (81) కన్నుమూశారు. భారత డేవిస్‌కప్‌ జట్టు కోచ్‌ జీషన్‌ అలీ ఆయన కుమారుడు. అక్తర్‌ అలీ 1958 నుంచి 1964 వరకు ఎనిమిది డేవిస్‌ కప్‌ పోరాటాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. రామనాథన్‌ కృష్ణన్, నరేష్‌ కుమార్, జైదీప్‌ ముఖర్జీ వంటి దిగ్గజాలతో ఆయన కలిసి ఆడారు. అలీ పేరున్న కోచ్‌ కూడా. 1996 నుంచి 1993 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేశారు. మలేసియా, బెల్జియం జట్లకు కూడా అలీ కోచింగ్‌ ఇచ్చారు.

తీవ్ర అస్వస్థతకు గురైన అలీని రెండు వారాల క్రితం కోల్‌కతా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతని ఛాతీలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గమనించారు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించి ఆదివారం కన్నుమూసినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పలువురు క్రీడా ప్రముఖులు అలీ మృతిపట్ల సంతాపం తెలియజేశారు.