చెన్నై టెస్ట్ : టీమిండియా విజయ లక్ష్యం 420

చెన్నై టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 178 పరుగులకే ఆలవుట్ అయింది. స్పిన్నర్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టారు. ఆయనతో తోడుగా నదీమ్ 2, బుమ్రా, ఇషాంత్ చెరో వికెట్ పడగొట్టడంతో ఇంగ్లండ్ ని 178కే కట్టడి చేశారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కి దక్కిన 241 పరుగుల ఆధిక్యంతో కలిపి.. టీమిండియా ముందు 419 పరుగుల విజయక్ష్యం ఉంచినట్టయింది.

పిచ్ స్పిన్నర్ గా అనుకూలిస్తోంది. ఇలాంటి పిచ్ పై 400టార్గెట్ ని చేధించడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో కోహ్లీ సేన డ్రా కోసం ప్రయత్నిస్తోందా.. ? లేక భారీ టార్గెట్ ని చేధించి చరిత్ర సృష్టిస్తుందా ? అన్నది చూడాలి. తొలి ఇన్నింగ్స్ లో రాణించని రోహిత్, కోహ్లీ, రహానె రాణిస్తే.. టీమిండియా పని ఈజీ కావొచ్చు.