ప్రభాస్ కోసం ప్రియాంక చోప్రా ?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్లో పెట్టేసిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ సెట్స్ పైన ఉండగానే.. సలార్ సినిమాని ప్రారంభించాడు. ఈ చిత్రానికి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ సరికొత్త అప్‌డేట్‌ ప్రస్తుతం అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ‘సలార్‌’ కోసం గ్లోబల్‌స్టార్‌ ప్రియాంకా చోప్రా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌-హాలీవుడ్‌ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియాంక.. ప్రస్తుతం ఈ రెండు ఇండస్ట్రీల్లో వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘సలార్‌’పై బాలీవుడ్‌ ప్రేక్షకుల చూపు పడేలా చేసేందుకు ప్రియాంకా చోప్రాను రంగంలోకి దించాలని చూస్తున్నారట.  ప్రియాంక ‘సలార్‌’లో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనున్నారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.