కేటీఆర్ విషయంలో వెనకడుగు ఎందుకు ?


మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే ప్రచారానికి సీఎం కేసీఆర్ పులిస్టాప్ పెట్టేశారు. ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలపై స్పందించారు. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నా. ఇంకా 10యేళ్లు నేనే సీఎంగా ఉంటా. కేటీఆర్ సీఎం కాబోతున్నారు అనే కామెంట్స్ చేసే వారిపై ఇకపై చర్యలు ఉంటాయి’ అన్నారు. దీంతో త్వరలోనే మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే భజనకు పులిస్టాప్ పెట్టినట్టయింది.

వాస్తవానికి కొడుకు కేటీఆర్ విషయంలో సీఎం కేసీఆర్ నుంచి ఇలాంటి రియాక్షన్ ని ఎవరు ఊహించి ఉండరు. అదే కేసీఆర్ వ్యూహాం. ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం బాగులేదు. ఇప్పటికిప్పుడు కేటీఆర్ ని సీఎం ని చేస్తే.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ విఫలమయ్యారని ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇదీగాక.. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలతో తెరాస ఇమేజ్ కొంత వరకు డ్యామేజ్ అయింది. ఇదీగాక.. మరోసారి ఎమ్మెల్యే టికెట్ అనుమానమే అని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే.. కేటీఆర్ విషయంలో సీఎం కేసీఆర్ త్వపడటం లేదని తెలుస్తోంది.