చెన్నై టెస్ట్ : రహాన్ డకౌట్ 


చెన్నై టెస్ట్ లో టీమిండియా విజయం సాధించడం పక్కనపెడితే.. కనీసం డ్రా కూడా ముగించడం కష్టంగానే కనిపిస్తోంది. 420 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా నిన్న ఓపెనర్ రోహిత్ శర్మ (12) వికెట్ ని కోల్పోయి 39 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఉదయం ఆట మొదలైన కొద్దిసేపటికే నయావాల్ పుజారా (15) వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న యువ ఓపెనర్ 50 పరుగులు పూర్తి చేయగానే పెలివియన్ చేరాడు.

వైఎస్ కెప్టెన్ రహానె తీవ్రంగా నిరాశపరిచాడు. డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ టెస్టుని కనీసం డ్రా చేసుకోవడం  కూడా కష్టమే అని తేలిపోయింది. టీమిండియా డ్రా చేసుకుంటే అది అద్భుతమే అని చెప్పాలి. క్రీజులో కెప్టెన్ కోహ్లీ ఎంతసేపు ఉంటాడు అన్నదానిపై మ్యాచ్ డ్రాగా ముగిస్తుందా ? అన్నది ఆధారపడి ఉంది. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్ల నష్టానికి 92 పరుగులతో ఆటని కొనసాగితోంది. క్రీజులో కెప్టెన్ కోహ్లీ (11), పంత్ (0) ఉన్నారు.

చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 578 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా మాత్రం తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులే చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 241 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఇంగ్లండ్ ని 178 పరుగులకే కట్టడి చేశారు. స్పిన్నర్ అశ్విన్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా విజయలక్ష్యం 420గా మారింది.