ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికలకు 29,732 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 3,458 సమస్యాత్మకం, మరో 3,594 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ సందర్భంగా 1,130 మంది ఎన్నికల అధికారులు, మరో 3,249 మంది స్టేజ్‌-2 అధికారులు, 1,432 మంది సహాయ ఎన్నికల అధికారులు, 33,533 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 44,392 మంది సిబ్బంది సేవలు వినియోగించనున్నారు. 519 మంది జోనల్‌ అధికారులు, పోలింగ్‌ సరళి పరిశీలించేందుకు 1,221 మంది పర్యవేక్షకులు, 3,047 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు.

మొత్తం 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగుతోంది. సర్పంచి స్థానాలకు 7,506 మంది,  20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది పోటీలో ఉన్నారు. పోలింగ్‌కు 88,523 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన 3,249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో నిలిపివేసిన ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సోమవారం సాయంత్రం తిరిగి అనుమతించారు.