ఇలా ఆడితే.. తొలి టెస్ట్’లో టీమిండియాదే విజయం !
వన్ సైడ్ అవుతుందనుకున్న చెన్నై టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 578 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా మాత్రం తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులే చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 241 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఇంగ్లండ్ ని 178 పరుగులకే కట్టడి చేశారు. స్పిన్నర్ అశ్విన్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా విజయలక్ష్యం 420గా మారింది.
నాల్గోరోజూ వికెట్ నష్టానికి టీమిండియా 39 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి ఇంకా 381 పరుగులు కావాలి. ఒక్కరోజులో ఇంతటి భారీస్కోర్ చేయడం దాదాపు అసాధ్యం. కానీ టీమిండియాలో భయమెరుగని బ్యాట్స్ మెన్స్ ఉన్నారు. గేల్, కోహ్లీ, పంత్ బ్యాట్ ఝలిపిస్తే ఈ భారీ టార్గెట్ ని చేధించవచ్చు. వీరికితోడు పుజారా, రహానె వికెట్స్ పడకుండా వీరికి సహకారం అందించాలి. కానీ కొద్దిసేపటి క్రితమే పుజారా (15) అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 2 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో గిల్ (35), కోహ్లీ (1) ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండో సెషన్ వరకు డ్రా జాగ్రత్తగా ఆడి.. మూడో సెషన్ లో టీ20 ఆడితే సరిపోతుందేమో.. !