GHMC మేయర్ ఎన్నిక : ఎక్స్అఫీషియో సభ్యులు.. వీరే !
GHMC మేయర్ ఎన్నిక కోసం సర్వం సిద్ధం అయింది. గురువారం GHMC పాలకవర్గం కొలువుదీరనుంది. ఆ రోజు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. సీల్డ్ కవర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ల పేర్లు ఉంటాయని సీఎం కేసీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. మేయర్, డిప్యూటీ మేయర్ కూడా మహిళే అని సమాచారమ్. ఇక గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు ఉన్న 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాను కూడా బల్దియా అధికారికంగా వెల్లడించింది. ఇందులో టీఆర్‌ఎస్ కు చెందిన వారు 32 మంది, మజ్లిస్-10, బీజేపీ-2 ఉన్నారు.
తెరాస-32
ఎమ్మెల్సీలు : మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎంఎస్ ప్రభాకర్‌రావు, టి.భానుప్రకాశ్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, బాలసాని లక్ష్మీనారాయణ, మహ్మద్ ఫరీదుద్దిన్, వి.భూపాల్‌రెడ్డి, పురాణం సతీశ్‌కుమార్, కల్వకుంట్ల కవిత, బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్
ఎంపీ రాజ్యసభ : కే కేశవరావు, ధర్మపురి శ్రీనివాస్, వడితెల లక్ష్మీకాంతరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, జోగినిపల్లి సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి(లోక్‌సభ)
ఎమ్మెల్యేలు : తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావు, జి.సాయన్న, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, కాలేరు వెంకటేశ్, ఎల్విస్ స్టీఫెన్‌సన్ (నామినేటెడ్)
మజ్లిస్ :
అసదుద్దీన్ ఓవైసీ (లోక్‌సభ ఎంపీ),
ఎమ్మెల్సీలు : సయ్యద్ అమినుల్ హుస్సేన్ జాఫ్రీ, మీర్జా రియాజ్ ఉల్ హస్సన్ ఎఫెంది,
ఎమ్మెల్యేలు : అక్బరుద్దీన్ ఓవైసీ, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మహ్మద్ మోజంఖాన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్, కౌసర్ మోహియుద్దీన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, జాఫర్ హుస్సేన్
బీజేపీ – 2
జి.కిషన్‌రెడ్డి (ఎంపీ లోక్‌సభ),
ఎమ్మెల్యే – రాజాసింగ్