నాగ చైతన్యకు పెళ్లి చూపులు
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యకు ఇప్పటికే పెళ్లైంది. స్టార్ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఆదర్శ దంపతులు అనిపించుకుంటున్నారు. అలాంటప్పుడు.. చైతూకు పెళ్లి చూపులేంటీ అనుకుంటున్నారా ? అలాంటిదేమీ లేదు. కానీ పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో చైతూ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారమ్.
తరుణ్‌భాస్కర్ ఒక కథను చైతూకి వినిపించాడట. అందులో హీరో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. కథ నచ్చడంతో చైతూ వెంటనే ఓకే చెప్పినట్లు చిత్రవర్గాల సమాచారం. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రస్తుతం.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలోనూ చైతూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి థ్యాంక్యూ అనే టైటిల్ ని ఖరారు చేశారు.