TSలో కొత్త బార్’లకు భలే గిరాకీ

గుడి కడతామంటే ఎవరు ముందుకు రారేమో.. కానీ బార్ పెడదామంటే మాత్రం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడతాయ్. ఇప్పుడు తెలంగాణలో పెట్టబోయే కొత్త బార్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరో 159 బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటి కోసం 7,360 మంది అప్లికేషన్‌ పెట్టుకున్నారు.

యాదగిరిగుట్టలో ఒక్క బార్‌ కోసం ఏకంగా 277 దరఖాస్తులు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 55 బార్లకు 1053 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ నెల 10న ఆయా జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ ద్వారా అర్హుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2011 జనాభా ఆధారంగా బార్లకు లైసెన్సు ఫీజులను ప్రభుత్వం నిర్దేశించింది. 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.30 లక్షలు, 50 నుంచి 5 లక్షల మంది ఉన్న చోట రూ.42 లక్షలు ఫీజుగా నిర్ణయించింది. 5 లక్షల నుంచి 20 లక్షల మధ్య జనాభా కలిగిన ప్రాంతాల్లో రూ.44 లక్షలు, 20 లక్షలకుపైగా జనం ఉన్న చోట్ల రూ.49 లక్షలు లెక్కన చెల్లించాల్సి ఉంటుంది.