షర్మిల పార్టీపై తెరాస కామెంట్స్
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయం తామేననే బీజేపీ అంటోంది. అందుకే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో తమని ప్రజలు ఆధారించారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తాచాటుతామని ధీమాగా చెబుతున్నారు.
ఈలోపు తెలంగాణలో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తోంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటులో నిమగ్నమైందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు లోటస్ పాండ్ లో కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ ఏర్పాటుపై తెరాస నేతలు స్పందిస్తున్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం లేదన్నారు.
“మా పార్టీ ఉన్నన్ని రోజులూ వేరే పార్టీ మనుగడ సాధించలేదు. మా పార్టీకి, మా నేత కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదు, రాదు. ప్రజలందరూ కేసీఆర్‌ను కోరుకుంటున్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్న ప్రజలు వేరే శక్తులొచ్చి ఫ్యాక్షనిజం చేస్తామంటే ఒప్పుకోరు” అని గంగుల చెప్పుకొచ్చారు.