‘లైగర్’ రిలీజ్ డేట్


లైగర్ రిలీజ్ డేటు వచ్చేస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. అనన్యపాండే హీరోయిన్. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘లైగర్’‌ రిలీజ్‌ డేట్ ని రేపు ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.

రేపు (ఫిబ్రవరి 11) ఉదయం గం:8.14ని.లకు చెప్పబోతున్నామంటూ ట్విటర్‌ వేదికగా తెలియజేసింది. దీంతో ‘లైగర్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్ లో నంబరు 1గా నిలిచింది. ఈ చిత్రంలో బాక్సర్‌గా కనిపించనున్నాడు విజయ్‌. ఈ సినిమాపై విజయ్ చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమా కథ ప్రేక్షకులని పిచ్చోళ్లని చేస్తుంది. షాక్ ఇస్తుందని ఓ ఇంటర్వ్యూలో విజయ్ అన్నారు.