‘నాట్యం’ టీజర్ ని వదిలిన తారక్

రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్న చిత్రం ‘నాట్యం’. ఈ సినిమాకు శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు న‌టిస్తోన్న‌ తొలి సినిమా ఇది.

తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. నాట్యం అనే పదానికి అసలైన అర్థం చెబుతూ టీజర్ ని కట్ చేశారు. ‘కథను మ‌నం వింటామ‌ని, అదే కథను కళ్లకు చూపిస్తే దాన్ని నాట్యం అంటాం’ అని తెలిపారు. సంగీతం అద్భుతంగా కుదిరింది. టీజర్ ని చూస్తే సినిమా హిట్ గ్యారెంటీ అనే ఫీల్ కలుగుతోంది.