TRS-MIM అక్రమ సంబంధం మరోసారి బయటపడింది !

‘టీఆర్ఎస్-ఎంఐఎం’ల మధ్య అక్రమ సంబంధం మరోసారి బయటపడింది అన్నారు తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్. GHMC నూతన మేయర్ గా బంజారాహిల్స్ కార్పోరేటర్ గధ్వాల విజయలక్ష్మీ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే మేయర్ ఎన్నిక టైమ్ లో అనూహ్యంగా ఎంఐఎం తెరాసకు మద్ధతిచ్చింది. దీంతో తెరాసకు ఎక్స్ అఫిషియో ఓట్లని వాడుకొనే అవసరం లేకుండా పోయింది. మేయర్ ఎన్నిక మరింత ఈజీ అయిపోయింది.

మరోవైపు, భాజాపా వ్యూహాం ఫలించినట్టయింది. తెరాస-భాజాపా ఒక్కటేనని భాజాపా మొదటి నుంచి ప్రచారం చేస్తోంది. ఇప్పుడు మేయర్ ఎన్నిక వేళ తెరాస-ఎంఐఎం దోస్తాన బయటపడింది. దీన్ని భవిష్యత్ లో భాజాపా వాడుకొనే అవకాశాలున్నాయి. ఇక మేయర్ ఎన్నికపై స్పందించిన తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్.. తెరాస-ఎంఐఎంల అక్రమ సంబంధం మరోసారి బయటపడిందన్నారు. 

జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండడం ఖాయమని తెలిపారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్రచేస్తున్నాయని సంజయ్ మండిపడ్డారు. ఒక్క పైసా అవినీతి జరిగినట్టు తెలిసినా..  ఈ రెండు పార్టీలను బజారుకీడ్చుతామని బండి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో తమ మధ్య పొత్తులేదని, తాము వేర్వేరు అని చెప్పి సిగ్గులేకుండా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.