తెరపైకి ఈటెల కొత్త పార్టీ

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ వెనక ఎవరు ఉన్నారు ? షర్మిల ఎవరు వదిలన బాణం ?? అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ భాజాపా మహిళా నేత డికే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటెల కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని ఆమె బాంబు పేల్చారు.

ఇటీవల మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తెరాస ముఖ్యనేతలు, కేసీఆర్, కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు కూడా త్వరలోనే కేటీఆర్ సీఎం కాబోతున్నారని అన్నారు. అంతేకాదు.. ఫిబ్రవరి 18నే కేటీఆర్ కి పట్టాభిషేకం అనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని సీఎం కేసీఆర్ త్వరగానే పులిస్టాప్ పెట్టేశారు.

ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ ని సీఎం ని చేసేది లేదు. ఇంకా 10యేళ్లు తానే ముఖ్యమంత్రినని ప్రకటించారు. కేటీఆర్ ని సీఎం చేయడంలో కేసీఆర్ యూటర్న్ తీసుకోవడానికి కారణం మంత్రి ఈటెల రాజేందర్ నే అని డీకే అరుణ అంటున్నారు. కేటీఆర్ ని సీఎం చేస్తే ఈటెల కొత్త పార్టీ పెడతారనే భయంతోనే సీఎం మార్పు ప్రచారానికి సీఎం కేసీఆర్ తెరదించారని అన్నారు.