అరియానాకు అరుదైన ఘనత

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీని గూగుల్ సప్రైజ్ చేసింది. గూగుల్‌లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ బిగ్‌బాస్‌ తెలుగు అని టైప్‌ చేయగా అరియానా గ్లోరీ అని చూపిస్తోంది. దీంతో తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇంతటి ఘనత దక్కిన తొలి కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది. ఈ విషయాన్ని ఆమె ‘సీరియస్‌లీ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అరియానా రియాక్షన్ తర్వాత.. ఆమె పేరును గూగుల్ తొలగించడం విశేషం. సప్రైజ్ చేసిన గూగుల్ నే అరియానాకు షాక్ ఇచ్చింది అన్నమాట.

ఇక బిగ్ బాస్ తో అరియానా తలరాతే మారిపోయింది. బిగ్ బాస్ హౌజ్‌లో ముక్కసూటి మాట్లాడుతూ.. బోల్డ్ బ్యూటీ అనిపించుకుంది. బిగ్ బాస్ టాప్ -5లో నిలిచింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక.. అరియానాకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఫోటో షూట్స్, టీవీ షోస్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తో బిజీ అయిపోయింది. అంతేకాదు.. హీరోయిన్ గా ప్రమోషన్ కొట్టేసింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.

ఇక ఇటీవల శ్రీముఖి గ్యాంగ్ తో కలిసి గోవా వెళ్లిన అరియానా.. అక్కడ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి ఫోటోలకి పోజులిచ్చింది. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. కామెంట్స్ తో నెటిజన్స్ హీటెక్కించారు. వాస్తవానికి.. అరియానాకి క్రేజ్ ని తీసుకొచ్చింది వర్మనే. ఓ సారి ఆయన్ని అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో అరియానాపై హాట్ హాట్ కామెంట్స్ చేశాడు ఆర్జీవీ. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. అదే.. అరియానాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చేలా చేసిందని చెబుతుంటారు.