శంకర్-చరణ్-దిల్ రాజు.. ఫిక్స్ !


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఏంటీ ? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్నమూరి చెప్పిన కథని చరణ్ ఓకే చేశారనే వార్తలు వినిపించాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చరణ్ కోసం ప్రవీణ్ సత్తారు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ఫిక్స్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తారని తెలిసింది.

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రానికి మొదట దిల్ రాజునే నిర్మాతగా ఫిక్సయ్యాడు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి దిల్ రాజు తప్పుకున్నారు. దీంతో రోబో నిర్మాతలు భారతీయుడు 2 ని టేకప్ చేశారు. అయితే భారతీయుడు సెట్ లో భారీ ప్రమాదం కారణంగా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కొత్త సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శంకర్-చరణ్-దిల్ రాజు కాంబో తెరపైకి వచ్చింది. అతి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని సమాచారమ్.