కాజల్ కు నిద్రలేని రాత్రులు

చందమామ కాజల్ నిద్రలేని రాత్రులు గడిపిందట. ఇటీవలే పెళ్లయింది కదా..! మొగుడితో కలిసి నైట్ అవుట్స్ చేసి ఉంటుంది.. అందుకే నిద్రలేని రోజులు గడిపి ఉంటుంది అనుకునేరూ.. !! రీజన్ అది కాదట. కాజల్ ‘లైవ్‌టెలికాస్ట్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కు వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న షాకింగ్ విషయాలు తెలిపింది.ఏకాంత ప్రదేశంలో షూటింగ్‌ చేయడం వల్ల తాను భయపడి నిద్ర కూడా పోలేదని తెలిపింది.

“మేము షూటింగ్ చేసిన ఇల్లు కొండపై ఉండేది. అది డైరెక్టర్‌ స్నేహితుడిది. దానికి చుట్టుపక్కల పరిసరాల్లో ఇంకో ఇల్లు కూడా లేదు. వాతావరణం కూడా నిర్మానుష్యంగా చాలా భయంకరంగా ఉండేది. ఈ వెబ్‌సిరీస్‌కు అలాంటి స్థలమే సరైంది. అయితే.. ఆ షూటింగ్‌ అయిపోగానే ప్యాకప్‌ చెప్పి ఇంటికి వెళ్లిన నాకు నిద్రపట్టేది కాదు. విపరీతంగా భయపడిపోయాను. వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ పూర్తయ్యే వరకూ ఏరోజూ నేను సరిపడా నిద్రపోయింది లేదు’ అని కాజల్‌ చెప్పుకొచ్చింది.

లైవ్ టెలికాస్ట్ కథ ఏంటంటే.. ? ఒక సూపర్‌ హిట్‌ షో చిత్రీకరణ కోసం ఇంట్లోకి వెళ్తుంది చిత్రబృందం. షూటింగ్‌ చేసే ఈక్రమంలో వాళ్లున్న ఇంటికి అతీంద్రియ శక్తులున్నాయనే నిజం తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్లు షూటింగ్‌ పూర్తి చేశారా..? ఆ ఇంట్లో నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ. ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలున్నాయి.