తెరాస-ఎంఐఎం ఒక్కటే

జీహెచ్‌ఎంసీ తెరాస మేయర్‌గా బంజారాహిల్స్‌ తెరాస కార్పొరేటర్‌, సీనియర్‌నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని ఎంపిక అయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పేటర్ మోతె శ్రీలత ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం సడెన్ సప్రైజ్ ఇచ్చింది. ఆఖరి నిమిషంలో తెరాసకు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. దీంతో తెరాసకు ఎక్స్ ఎఫిషియోస్ ఓట్లు అవసరం లేకుండా పోయింది. డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలోనూ.. ఎంఐఎం అభ్యర్థిని నిలపకపోవడం విశేషం.

మేయర్ గద్వాల విజయలక్ష్మి (బంజారాహిల్స్‌) పర్సనల్ విషయాలకొస్తే.. ఆమె వయసు 56యేళ్లు. ఎల్‌ఎల్‌బీ చదివారు. రాజీయ అనుభం: 2016లో బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి అదే డివిజన్‌ నుంచి గెలుపొందారు. విజయలక్ష్మీ అమెరికాలో కొన్నాళ్లపాటు ఫ్రొఫెసర్ గా పని చేసిందని సమాచారమ్.