షర్మిల వద్దకు జగన్ దూత.. బుజ్జగింపులు షురు !
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలనుంది. అందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నానని ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రజలపై ప్రేమతో షర్మిల కొత్త పార్టీ పెట్టడం లేదు. జగనన్నపై కోపంతో ఈ బాణం తెలంగాణలోకి దూసుకొచ్చింది. దోసుకొనేందుకు రెడీ అవుతుందనే విమర్శలున్నాయి.
షర్మిలని సీఎం జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 2019లో విశాఖ ఎంపీ సీటు అడిగితే ఇవ్వలేదు. 2020లో రాజ్యసభ సీటు ఇస్తానని బుజ్జగించాడు. ఆ తర్వాత అది కూడా ఇవ్వలేదు. ఇదీగాక.. అన్నా-చెల్లి మధ్య ఆస్తివివాదాలు మొదలయ్యాయ్. వదిన భారతీతో షర్మిలకి ఏమాత్రం పొసగడం లేదనే విమర్శలున్నాయ్. ఈ నేపథ్యంలోనే జగన్ అనుమతి లేకుండానే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలని బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలని కలిశారు. ఆమెతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో భేటీ అయ్యారు. వీరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. జగన్ దూతగానే ఆర్కే షర్మిలని కలిసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త పార్టీ ఆలోచన విరమించుకోవాలి. అది మంచిది కాదు. సమయం చూసుకొన్ మంచి పదవి ఇస్తానని జగనన్న కబరు పంపినట్టు తెలిసింది.
మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటులో భాగంగా జిల్లాల నేతలతో సమావేశాలకు షర్మిల ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నెల 21న ఖమ్మం జిల్లాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. షర్మిలనే ఖమ్మం వెళ్లనున్నారు. ఖమ్మంలో పోడు భూముల సమస్యని షర్మిల టేకప్ చేయనుందని సమాచారమ్.