చైనాకు అంగుళం భూమి కూడా ఇవ్వం : రాజ్ నాథ్

చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని పార్లమెంట్ వేదికగా కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రాజ్ నాథ్ నేడు రాజ్యసభలో ప్రకటన చేశారు.

లద్దాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందం కుదిరిందని రాజ్ నాథ్ తెలిపారు. సరిహద్దు ఉద్రిక్తతలపై చైనాతో జరిగిన నిరంతర చర్చలతో పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో భారత్‌, చైనా దశల వారీగా, పరస్పర సమన్వయంతో సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించనుంది. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదన్నారు.