విజయ్ సేతుపతిని బెదిరించిన సుకుమార్
విజయ్ సేతుపతి – స్టార్ హీరో అంతకుమించి. ఆయన కథ ఓకే చేశారంటేనే బ్లాక్ బస్టర్ హిట్. అలాంటి నడుటు ఓ కొత్త దర్శకుడికి ఓకే చెప్పడం గొప్ప విషయం. అది కూడా తెలుగు సినిమా. అందులో విలన్ పాత్ర కోసం. ఆ దర్శకుడు బుచ్చిబాబు. ఆ సినిమా ఉప్పెన. రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఉప్పెన చిత్రబృందం.. విజయ్ సేతుపతిని ఎలా ఒప్పించారు అనే విషయాన్ని వివరించింది.
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన సుకుమార్ శిష్యుడు అన్న సంగతి తెలిసిందే. మొదట బుచ్చిబాబు కథని సుకుమార్ కి చెప్పాడట. ఆయనకి కథ నచ్చింది. ఈ సినిమా కోసం మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కావాలని కోరాడట. ఆయన్ని ఓకే చేసిన తర్వాత కృతీ శెట్టి కావాలని కోరాట. ఆమెని ఓకే చేశారట. అయితే విలన్ పాత్ర కోసం మొదటి నుంచి విజయ్ సేతుపతి కావాలని పట్టుబడ్డాట బుచ్చిబాబు. దీంతో చెన్నై వెళ్లి విజయ్ సేతుపతిని కలవడం. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చిన టైమ్ లో ఓ స్టార్ హోటల్ లో కథని చెప్పడం జరిగాయట.
అయితే విజయ్ సేతుపతి ఓకే చెప్పకుండా.. డేట్స్ అర్జెస్ట్ అయ్యేలా లేవని అన్నారట. అప్పుడు సుకుమార్ విజయ్ కి ఒకింత క్లాస్ పీకినట్టు మాట్లాడరట. మావాడు మీ కోసం అద్భుతమైన కథని రాస్తే.. మేరేమో.. డేట్స్ అంటున్నారని అన్నారట. అప్పుడు విజయ్ డేట్స్ అర్జెస్ట్ చేసి ఓకే చెప్పేశారట. విజయ్ కి కథ బాగా నచ్చింది. అందుకే ఆయన కూడా డేట్స్ అర్జెస్ట్ చేసుకొని మరీ చేయగలిగాడరని సుకుమార్ చెప్పుకొచ్చారు. రిలీజ్ కి ముందే మంచి బజ్ ఉన్న ఉప్పెనకు ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా రానున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.