‘కిన్నెరసాని’ థీమ్ ని విడుదల చేసిన చరణ్

‘విజేత’గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని నటనలో మరింత శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు వరుస సినిమాలని లైన్ లో పెడుతున్నాడు. ఇందులో ఒకటి ‘కిన్నెరసాని’. ఈ చిత్రానికి రమణ తేజ దర్శకుడు. #Desharaj కథని అందించారు. రామ్ తళ్లూరి నిరిస్తున్నారు. కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా  #ThemeOfKinnerasani ని విడుదల చేశారు.

కిన్నెరసాని థీమ్ అదిరిపోయింది. థీన్ చూస్తే.. ఇదో థ్రిల్లర్ సినిమాల అనిపిస్తోంది. కాన్సెప్ట్, నేపథ్య సంగీతం.. అదిరిపోనుందని థీమ్ తో హింట్ ఇచ్చేశారు. ఇప్పటి వరకు కల్యాణ్ దేవ్ ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. కిన్నెరసానితో ఆయన ఖాతాలో హిట్ పడేలా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? ఇతర నటీనటు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.