రస్మిక హాటు స్టెప్పులు.. !!


హీరోయిన్ రష్మిక మందన సినిమాలతో ఫుల్ బిజీ. తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో నటిస్తోంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇలాంటి బిజీ టైమ్ లోనూ రష్మిక ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేస్తోంది. ‘టాప్ టక్కర్’ పేరుతో సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, బాద్షా కలసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ ను రూపొందిస్తున్నారు.

ఇందులో రష్మిక డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన టీజర్ ను సోమవారం విడుదల చేశారు. దీని గురించి ఈ చిన్నది చెబుతూ, ‘మ్యూజిక్ ఆల్బమ్ లో నేను డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ అనుభవం బాగుంది. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది కూడా. ఇది త్వరలో మీ ముందుకు రానుంది. ఇకపై పెళ్లిళ్లు, కాలేజీలు.. వంటి చోట ఈ ఆల్బమ్ వినిపిస్తుందనుకుంటున్నాను.. దీని కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా”నని తెలిపింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన స్టిల్స్ బయటికొచ్చాయ్. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో రస్మిక హాట్ హాటుగా కనిపిస్తోంది.