‘చెక్’ నైజాం రేటు ఎంతో తెలుసా ?

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం ‘చెక్’. ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్.చదరంగం నేపథ్యంలో టెర్రరిస్ట్ ముద్రపడిన ఓ యువకుడి కథ. ఈ సినిమా ఈ నెల 26న విడుదల కాబోతోంది.

ఈ సినిమా బిజినెస్ ను ఇటీవలే క్లోజ్ చేశారు. నైజాం హక్కులను వరంగల్ శ్రీను 5.40 కోట్లకు కొనుగోలు చేసారు. ఆంధ్ర ఏరియా 8 కోట్ల రేషియోలో క్లోజ్ చేసినట్లు సమాచారమ్. సీడెడ్ హక్కులను కెఎఫ్ సి సంస్థ తీసుకుంది. ఇప్పటికే డిజిటల్ శాటిలైట్ జెమినికి విక్రయించారు. ఇక హిందీ డబ్బింగ్ మాత్రమే క్లోజ్ చేయాల్సి వుంది.