కేసీఆర్ ఢిల్లీలోనే కాదు.. హైదరాబాద్ లోనూ వంగి వంగి దండాలు.. !?

గ్రేటర్ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశానికి భాజాపా పీడ పోవాలె. త్వరలోనే ఢిల్లీకి పోతా. భాజాపాయేతర పార్టీలని ఏకం చేస్తా. ఢిల్లీ గత్తర లేపుతా. భాజాపాని గద్దె దింపుతానని గర్జించాడు. చెప్పినట్టుగానే గ్రేటర్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. కానీ గర్జించలేదు. ప్రధాని మోడీతో పాటు ఇతర కేంద్ర పెద్దలకు వంగి వంగి దండాలు పెట్టారు. హైదరాబాద్ తిరిగొచ్చాక.. అప్పటి వరకు వ్యతిరేకించిన కేంద్ర పథకాలని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణ భాజాపా, కాంగ్రెస్ నేతలు సటైర్స్ వేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా కేంద్ర మంత్రి, తెలంగాణ భాజాపా సీనియర్ నేత కేసీఆర్ గురించి మరో షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే కాదు.. హైదరాబాద్ లోనూ వంగి వంగి దండాలు పెడతారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం అధినేతలు వేరు కాదని.. ఇద్దరు ఒకటే, ఎంఐఎంకి సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు వంగి వంగి సలాం చేస్తారనన్నారు. ఎంఐఎం కనుసన్నల్లో పోలీస్ అధికారుల నియామకాలు చేపట్టారన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఎంఐఎం తెరాసకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాజాపా నేతల విమర్శలకు మరింత పదను పెరిగింది.